టీజర్ టాక్ : సుబ్రహ్మణ్యపురం – కాన్సెప్ట్ ఓకే !

టీజర్ టాక్ : సుబ్రహ్మణ్యపురం – కాన్సెప్ట్ ఓకే !

Published on Oct 20, 2018 3:56 AM IST

సీనియర్ హీరో సుమంత్ నటిస్తున్న25వచిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’ టీజర్ ఈ రోజు విడుదలైయింది. ఇక టీజర్ చూస్తుంటే చిత్రంలో సుమంత్ నాస్తికుడిగా, దేవాలయాల మీద పరిశోధన చేసే పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు సురేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొత్తానికి ఈ టీజర్ చిత్రంపై అంచనాలను పెంచేలా వుంది. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన ‘కార్తికేయ చిత్రం’ మంచి విజయాన్ని సాధించింది. మరి ఈ చిత్రం కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.

నూతన దర్శకుడు సంతోష్ జాగర్లమూడి తెరక్కిస్తున్న ఈచిత్రంలో ఈశా రెబ్బ కథానాయికగా నటిస్తుంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు