ఏ.కరుణాకరన్ దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘తేజ్’. ఐ లవ్ యు. జూన్ 6న విడుదలైన ఈ చిత్రం విమర్శకులు మరియు సినిమా అభిమానుల నుండి మిశ్రమ ప్రతిస్పందనను పొందింది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే తక్కువగా రావడం గమనార్హం.
తాజా రిపోర్ట్స్ ప్రకారం కృష్ణా జిల్లాలో ‘తేజ్’ ఐ లవ్ యు మూడో రోజుకు రూ .10,77,020 షేర్ కలెక్ట్ చేసింది. కృష్ణా జిల్లాలో ఈ సినిమా మొదటి వారం వసూళ్లు మొత్తం 27 లక్షలు ఉండగా, అటు గుంటూరులో ‘తేజ్’ ఐ లవ్ యు రూ .8,88,510 వసూళ్లును రాబట్టి పర్వాలేదనిపించుకుంది. ఇక గుంటూరు జిల్లాలో ఈ సినిమా మొదటి వారం వసూళ్లు మొత్తం రూ. 37.68 లక్షలుగా ఉంది. ఇక ఈ సినిమాకు ఈ వారం చాలా కీలకం కానుంది.


