మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల’తేజ్ ఐ లవ్ యు’ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక వరుస పరాజయాల తో సతమతవుతున్న తేజు ఈ సినిమాతోనైనా విజయం సాధించి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడనుకుంటే ఈ చిత్రం కూడా పూర్తిగా నిరాశపరిచింది. ఇక ఈ చిత్ర పరాజయంతో రెండు హ్యాట్రిక్ లను ఖాతాలో వేసుకున్న ఆయన తన తరువాతి చిత్రాన్ని’నేను శైలజ’ ఫెమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో చేయనునున్నాడు.
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా ప్రారంభం కాకముందే తేజు మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. నూతన దర్శకుడు గోపాల్ చెప్పిన కథ నచ్చి కొత్త చిత్రానికి కమిట్ అయ్యాడట తేజు. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే ఈచిత్రం ఫై అధికారిక ప్రకటన వెలుబడే వరకు వేచి చూడాల్సిందే.


