కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ , అనుపమ జంటగా నటించిన చిత్రం ‘తేజ్ ఐ లవ్ యు’ .కొద్దిసేపటి క్రితం ఈ చిత్ర ట్రైలర్ విడుదలయింది . ఇక రెండు నిమిషాల ట్రై లర్ ను చూస్తుంటే లో సాయి ధరమ్ ఈ చిత్రంలో రాక్ స్టార్ పాత్రలో నటించినట్లుగా తెలుస్తుంది. పూర్తిగా కరుణాకరన్ మార్క్ తో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి ధరమ్ , అనుపమల కెమిస్ట్రీ హైలైట్ అవ్వనుంది .
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానున్న ఈచిత్రానికి విజువల్స్ , టెక్నికల్ వాల్యూస్ అదనపు ఆకర్షణ కానున్నాయి మరి ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ మధ్యన వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న తేజ్ ఈ చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కేలాగే వున్నాడు . క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ ఫై కే ఎస్ రామారావు నిర్మించిన ఈ చిత్రం జులై 6న ప్రేక్షకులముందుకు రానుంది .
ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి


