సెంటిమెంట్ కోసం తేజు వెనక్కి వెళ్లిపోయాడట !

సెంటిమెంట్ కోసం తేజు వెనక్కి వెళ్లిపోయాడట !

Published on Jun 14, 2018 8:32 PM IST


‘తేజ్ ఐ లవ్ యు’ చిత్రంతో జులై 6న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ . అయితే మొదటగా ఈ సినిమా ఈ నెల 29 న రిలీజ్ చేస్తాం అన్నారు ఆ తరువాత మల్లి ఈ కొత్త డేట్ ను ప్రకటించింది చిత్ర యూనిట్ . ఇలా వారం రోజులు ఆలస్యంగా విడుదల కావటం ఫై రకరకాల వార్తలు వచ్చాయి . అయితే దీనికి అసలు కారణం ఏమిటో తెలిసింది .

గతంలో మెగా హీరోలు నటించిన ఇంద్ర, తొలిప్రేమ , తమ్ముడు ,మగధీర , ఫిదా సినిమాలు జులై నెలలో విడుదలై మంచి విజయాన్ని సాధించాయి దాంతో తేజు కూడా ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. అలాగే ఈ చిత్ర బయ్యర్లు కూడా సినిమాని జూన్ చివరి వారంలో వస్తే కొంచం ఇబ్బందిని ఎదురుకోవాల్సి వస్తుందని జులై మొదటి వారంలో అయితే అన్ని రకాలుగా బాగుంటుందని కోరడంతో నిర్మాత ఈ చిత్రాన్ని జులై 6 రిలీజ్ చేయటానికి అగీకరించారట. ఈ సినిమా విజయం సాధించడం తేజ్ కి ఎంత ముఖ్యమో అందిరికి తెలిసిందే మరి ఈ మెగా సెంటిమెంట్ ఆయనకు కూడా కలిసిరావాలని ఆశిద్దాం .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు