మెగాహీరో సాయి ధరమ్ తేజ్ రెగ్యులర్ ధోరణిని పక్కనబెట్టి కొత్తగా ట్రై ప్రయత్నిస్తూ చేస్తున్న సినిమా ‘తేజ్ ఐ లవ్ యు’. పూర్తి ప్రేమ కథగా ఉండబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం పారిస్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, ధరమ్ తేజ్ లపై ఒక రొమాంటిక్ డ్యూయెట్ ను చిత్రీకరిస్తున్నారు.
ఇక నిన్ననే విడుదలైన సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ప్రేక్షకులు సినిమాలో కరుణాకరన్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని, తేజ్ కొత్తగా కనిపిస్తున్నాడని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు.


