వాయిదాపడిన ‘తేజ్ ఐ లవ్ యు’ !
Published on Jun 11, 2018 3:22 pm IST

వరుస ఫ్లాపులతో సతమవుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన కొత్త సినిమా ‘తేజ్ ఐ లవ్ యు’. కరుణాకరాన్ దర్శకత్వంలో రూపొందుతుండటంతో ఈ సినిమాకు మొదటి నుండి పాజిటివ్ బజ్ ఏర్పడింది. దానికి తోడు టీజర్ కూడ బాగుండటంతో సినిమాపై అంచనాలు ఇంకాస్త పెరిగాయి.

అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమాను ముందుగా జూన్ 29న విడుదలచేయాలని నిర్మాతలు భావించారు. కానీ ఇప్పుడు కారణాలు తెలీవు కానీ ఈ రిలీజ్ జూలై 6కు వాయిదాపడినట్టు సమాచారం. ఇటీవలే చిరంజీవి సమక్షంలో ఘనంగా ఆడియో వేడుకను జరుపుకున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. ఇందులో తేజ్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook