‘తేజ్ ఐ లవ్ యు’ టీజర్ ఎప్పుడంటే !

‘తేజ్ ఐ లవ్ యు’ టీజర్ ఎప్పుడంటే !

Published on Apr 30, 2018 1:46 PM IST

మెగాహీరో సాయి ధరమ్ తేజ్ కరుణాకరన్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రానికి ‘తేజ్ ఐ లవ్ యు’ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్ర టీజర్ ను రేపు ఉదయం 11 గంటల 30 నిముషాలకు రిలీజ్ చేయనున్నారు.

తేజ్ వరుస పరాజయాల్లో ఉండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. పైగా తేజ్ పాత రెగ్యులర్ లుక్ కు స్వస్తి చెప్పి ఈ సినిమాలో కొంచెం కొత్తగా కనిపిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు