నా సినిమా ‘తొలిప్రేమ’ స్టైల్లో ఉంటుంది – తేజ్
Published on Jun 17, 2018 1:15 pm IST

సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘తేజ్ ఐ లవ్ యు’ చిత్రం అన్ని పనుల్ని ముగించుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంతో ఎలాగైనా విజయాన్ని అందుకుని హిట్ ట్రాక్ ఎక్కాలని అనుకుంటున్నాడు తేజ్. తాజాగా విజయవాడలో జరిగిన ఆడియో సక్సెస్ మీట్లో మాట్లాడిన తేజ్ అనుపమ చాలా సహజమైన నటి అని అన్నారు.

కొన్ని సందర్బాల్లో పోటీపడి నటించాం అంటూ సినిమాను కరుణాకరన్ గారు చాలా బాగా తీశారని, సినిమా చూసేవాళ్ళు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని, సినిమా ‘తొలిప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్’ లాంటి చిత్రాల తరహాలో ఉంటుందని, ముఖ్యంగా రొమాన్స్ కొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చారు. మరి తేజ్ మాటల ప్రకారం సినిమా పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ తరహలో ఉంటుందో లేదో జూలై 6న తేలిపోనుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook