ఉదయ్ కిరణ్ బయోపిక్ కేవలం రూమరేనట !
Published on May 18, 2018 8:35 am IST


దర్శకుడు తేజ త్వరలో హీరో ఉదయ్ కిరణ్ జీవితాన్ని బయోపిక్ గా తెరకెక్కిస్తున్నట్టు, ఆ సినిమాకి ‘కాబోయే అల్లుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు గత రెండు మూడు రోజులుగా జోరైన వార్తలొచ్చాయి. తేజ ఉదయ్ కిరణ్ కు మంచి సన్నిహితుడు కావడంతో అందరూ ఈ వార్త నిజమేనని నమ్మేశారు. కానీ సంచలనకరమైన ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తేజ తేల్చి చెప్పారు.

ప్రముఖ పత్రికతో మాట్లాడిన ఆయన తనకు ఉదయ్ కిరణ్ బయోపిక్ చేసే ఆలోచనే తనకు లేదని, ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టుకొస్తాయో తెలియడంలేదని అన్నారు. అలాగే తన తర్వాతి సినిమా పూర్తి యాక్షన్ చిత్రంగా ఉంటుందని అంటూ అందులో రానా దగ్గుబాటి హీరోగా నటించే అవకాశాలున్నాయని హింట్ కూడ ఇచ్చారు. ఈ క్లారిఫికేషన్ తో ఇన్ని రోజులు హాట్ టాపిక్ గా మారిన ఉదయ్ కిరణ్ బయోపిక్ హడావుడికి తెరపడినట్లైంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook