ఈ సారి “అద్భుతం”తో వస్తున్న జాంబీరెడ్డి హీరో..!

Published on Jul 2, 2021 12:44 am IST


జాంబీరెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జా మంచి ఊపు మీద కనిపిస్తున్నాడు. వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవ‌ల ఎస్.ఎస్. రాజు దర్శకత్వంలో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ‘ఇష్క్’-‘నాట్ ఎ లవ్ స్టోరీ’ సినిమాను కంప్లీట్ చేసుకున్న తేజ ఇంకా అది రిలీజ్ కాకముందే మరో సినిమాను మల్లిక్ రామ్ దర్శకత్వంలో చేస్తున్నట్టు ప్రకటించాడు.

అయితే ఇందులో తేజ సరసన శివానీ రాజశేఖర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఆమె బర్త్‌డే సందర్భంగా నేడు ఈ సినిమా టైటిల్ “అద్భుతం” అనే పేరును ఖ‌రారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా చితృ బృందానికి నాని ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అయితే ఈ సినిమాకు జాంబీరెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మనే కథ అందిస్తున్నాడు. అయితే ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ మూవీ ఉండనున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తేజ ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో “హనుమాన్” అనే సినిమాను కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :