‘మిరాయ్’ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్ !

‘మిరాయ్’ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్ !

Published on Jan 19, 2026 11:00 AM IST

Mirai

తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్’ (Mirai) సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, భారీ విజయాన్ని అందుకుంది. ఐతే, తాజాగా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్ కావడంతో ఈ చిత్రం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ‘మిరాయ్’ (Mirai) చిత్రం జనవరి 25, 2026న సాయంత్రం 5:30 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం కానుంది. ఈ సినిమాకి థియేటర్లలో, అలాగే ఆ తర్వాత ఓటీటీలో కూడా మంచి టాక్ వచ్చింది. మరి ఈ చిత్రం, టెలివిజన్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

కాగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. సూపర్ యోధుడి పాత్రలో తేజ సజ్జా పర్ఫార్మెన్స్, విజువల్ గ్రాండియర్ ఈ చిత్రానికి బలంగా నిలిచాయి. ఇక మంచు మనోజ్ కీ రోల్ చేయగా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో విలన్‌గా మంచు మనోజ్ పాత్రకు సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాకు గౌర హరి సంగీతం అందించాడు.

తాజా వార్తలు