శ్వేతా బసు కి తేజ ఆఫర్?

శ్వేతా బసు కి తేజ ఆఫర్?

Published on Dec 5, 2014 10:25 AM IST

teja-swetha-basu
సెక్స్ రాకెట్ కేసులో నిందితురాలుగా నిలిచిన శ్వేతాబసు ప్రసాద్ కెరీర్ అగమ్యగోచరంగా మారింది. ఆమెను పునరావాస కేంద్రం నుండి ఇటీవలే విడుదల చేశారు. బయటకు రాగానే తనకు భవిష్యత్ సినిమాలపై ఆశలు వున్నాయని తెలిపినా ఒక అవకాశం కూడా రాలేదు

అయితే ఇప్పుడు టాలెంటెడ్ దర్శకుడు తేజ ఈ భామకు ఒక ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఈ వార్త ఇంకా ఖరారు కాకపోయినా ఇద్దరూ ఫ్లాప్ లలో వున్నారు గాబట్టి ఈ ప్రాజెక్ట్ పై పెద్దగా అంచనాలు లేకపోవచ్చు. శ్వేతా బసు హిందీలో ‘మక్డీ’ సినిమాతో ప్రవేశించి జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ భామ కెరీర్ లో కొత్త బంగారు లోకం వంటి హిట్ సినిమాలు విన్నాయి. శ్వేతా చివరిగా ఉదయ్ కిరణ్ తో కలిసి నువ్వెక్కడుంటే నేనక్కడుంటా సినిమాలో నటించింది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు