‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో సమంత చెల్లెలుగా, ‘హార్ట్ ఎటాక్’ సినిమాలో మోడరన్ క్యారెక్టర్లో నటించి ప్రేక్షకులలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది తెలుగమ్మాయి తేజస్వి. తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ఐస్ క్రీం’ సినిమాతో హీరోయిన్ గా ప్రమోట్ అయ్యింది. తొలి సినిమాతోనే సంచలనం సృష్టించింది. తాజాగా ‘హోలీ'(వర్కింగ్ టైటిల్) అనే తమిళ సినిమాలో నటించడానికి అంగీకరించింది. తమిళంలో ఆమెకిది తొలి సినిమా.
ప్రస్తుతం తేజస్వి నటించిన రెండు తెలుగు సినిమాలు ‘అనుక్షణం’, ‘లవర్స్’ విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఓంకార్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తుంది. అందం, అభినయంతో హీరోయిన్ గా వరుస అవకాశాలు సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది.


