తేజు ఆశలపై నీళ్లు చల్లిన ‘తేజ్ ఐ లవ్ యు’ !

తేజు ఆశలపై నీళ్లు చల్లిన ‘తేజ్ ఐ లవ్ యు’ !

Published on Jul 9, 2018 5:20 PM IST

tej i love u

ఇటీవల వరుస పరాజయాలతో కేరీర్ ను కొనసాగిస్తున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల తేజ్ ఐ లవ్ యు చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించడం లో మంచి పేరున్న కరుణాకరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక గత శుక్రవారం ప్రేక్షుకుల ముందుకు వచ్చినా ఈ చిత్రం నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపరిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర కలెక్షన్స్ ఏమంత ఆశాజనకంగా లేవు.

ఇక అటు ఓవెర్సిస్ లో కూడా ఈ చిత్రానికి మిశ్రమ స్పందనే లభించింది . దాంతో అక్కడ కూడా కలెక్షన్ల పరంగా పూర్తిగా నిరాశ పరిచింది. ఈ చిత్రంతోనైనా మంచి విజయం సాధించి హిట్ ట్రాక్ ఎక్కాలని భావించిన తేజు ఆశలు ఈ చిత్రం తో కూడా తీరలేదు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ ఫై కే ఎస్ రామారావు నిర్మించారు .

తాజా వార్తలు