‘తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ 25 లక్షలు విరాళం !

Published on Apr 10, 2020 3:35 pm IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న క్రమంలో.. కరోనా పై పోరాటంలో భాగంగా ఈ సంక్షోభ సమయంలో కరోనా వైరస్ బాధితుల సహాయార్థం కొరకు పలువురు ప్రముఖలు ముందుకొచ్చి విరాళాలు అందిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌ కు 25 లక్షలను విరాళంగా ఇచ్చింది. ఈ సందర్భంగా ఈ రోజు ఏషియన్ సునీల్ నారంగ్, రామ్ మోహన్, అభిషేక్ నామా తదితరులు కలిసి కేటీఆర్ కు చెక్కును అందజేసారు.

కాగా క‌రోనా వ్యాప్తి నిరోధం విష‌యంలో రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తున్నాయి. ప్ర‌భుత్వాల స‌ల‌హాలు, సూచ‌న‌లు ప్ర‌జ‌లంద‌రూ తూ.చ‌. త‌ప్ప‌కుండా పాటించాలి. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని స‌మ‌ష్టిగా ఎదుర్కోవాలి, అంద‌రూ ఇళ్ల‌ల్లోనే సుర‌క్షితంగా ఉండాలి. ఇక సినీ కార్మికులకు ఉపశమనం కలిగించడానికి మన టాలీవుడ్ తారలు మరియు ప్రముఖులు కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి)కు ఉదారంగా విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More