నిర్మాతల మండలిలో అవకతవకలు : ఆర్.కే.గౌడ్

నిర్మాతల మండలిలో అవకతవకలు : ఆర్.కే.గౌడ్

Published on Dec 7, 2015 7:23 PM IST

rk-goud
గడిచిన కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినీ నిర్మాతల మండలిలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని, వాటన్నింటినీ కప్పిపుచ్చే దిశగా నిర్మాతల మండలి ప్రయత్నాలు చేస్తోందని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ విమర్శించారు. ఈ ఉదయం ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఆయన హైద్రాబాద్‌లో ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసుకున్న నిర్మాతల మండలి ఫండ్స్‌ను పక్కదారి పట్టిస్తుందోని ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.

ఇంకా మాట్లాడుతూ.. “ఎన్నో ఏళ్ళుగా జరుగుతోన్న ఈ అవకతవకలు 2014-15కు సంబంధించిన లెక్కల్లో బయటపడ్డాయి. ఇదే విషయాన్ని నిర్మాతల మండలి మీటింగ్ సందర్భంగా అడిగితే అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించేలా కౌన్సిల్ వ్యవహరిస్తోంది. ఏళ్ళ పాటుగా వస్తోన్న ఫండ్స్‌లో చాలావరకు దుర్వినియోగం అయ్యాయి. వీటన్నింటిపై స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మండలిపై ఉంది” అని రామకృష్ణ గౌడ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు