బాలకృష్ణకు బర్త్ డే విశెష్ చెప్పిన తెలంగాణ గవర్నర్

బాలకృష్ణకు బర్త్ డే విశెష్ చెప్పిన తెలంగాణ గవర్నర్

Published on Jun 11, 2020 7:02 PM IST

balayya governor
నటసింహ నందమూరి బాలకృష్ణ 60వ జన్మదినం సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ బాలయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు స్పందిస్తూ నందమూరి బాలకృష్ణ గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారి నుండి జన్మదిన శుభాకాంక్షలు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆవిడకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఇక బాలకృష్ణ పుట్టిన రోజు కానుకగా ఈనెల 9న బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన చేస్తున్న టీజర్ విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది. బాలయ్య పంచె కట్టు లుక్, పవర్ ఫీల్ డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మిర్యాల రవీంద్రా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు