సినిమా రంగానికి షాక్ ఇవ్వనున్న తెలంగాణా ప్రభుత్వం

సినిమా రంగానికి షాక్ ఇవ్వనున్న తెలంగాణా ప్రభుత్వం

Published on Jul 4, 2014 4:16 PM IST

TFI
సినిమా రంగానికి ప్రస్తుత తెలంగాణా ప్రభుత్వం కోలుకోలేని దెబ్బకొట్టడానికి సిద్ధపడుతుంది. 1982లో ఆంద్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కోసం ఇచ్చిన భూమిని తిరిగిఇచ్చేయమని కోరింది. అప్పుడు మంజూరు చేసిన 40 ఎకరాల భూమిలో 5 ఎకరాలను రామానాయుడు స్టూడియోస్ గా నిర్మిస్తే 9 ఎకరాలలో పద్మాలయా స్టూడియోస్ నిర్మించారు

ఇప్పుడు ప్రభుత్వం ఈ సంస్థని తమకు చెందిన స్థలం నుండి ఒక 20 ఎకరాలను తిరిగిమ్మని కోరింది. అవి ఏ 20ఎకరాలన్నవి ఇంకా స్పష్టంకాలేదు. ఈ వార్త కొంతమంది నిర్మాతల వెన్నులో వణుకు పుట్టిస్తుంది

తెలుగు సినిమా రంగాన్ని అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఈ గొడవ ఎన్నిరోజులు నిలుస్తుందో చూడాలి

తాజా వార్తలు