తెలంగాణలో రేపటి నుండి థియేటర్స్ ఓపెన్ !

Published on Jul 17, 2021 7:13 pm IST

కరోనా మహమ్మారి దెబ్బకు మూతబడిన థియేటర్లు మళ్ళీ కొత్త సినిమాల రాకతో కళకళలాడటానికి రెడీ అవ్వనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవనున్నాయి. తాజాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన సినీ ప్రముఖులు థియేటర్స్ 100 ఆక్యుపెన్సీ గురించి చర్చించి ఒప్పించారు.

నిజానికి కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా దేశ వ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. దాంతో చాలా వరకు సినిమాలు ఓటీటీని ఆశ్రయిస్తున్నాయి. ఇలా అయితే థియేటర్స్ కి నష్టం వచ్చే అవకాశం ఉందని సినీ ప్రముఖులు థియటర్స్ ను ఓపెన్ చేసేలా ప్రయత్నాలు చేశారు. ఇక కొన్ని పెద్ద సినిమాలు థియేటర్‌ రిలీజ్‌ కోసం వేచి ఉన్న సంగతి తెలిసిందే. క్యూలో ఉన్న పెద్ద సినిమాలన్నీ వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

సంబంధిత సమాచారం :