ఆ స్టార్ హీరో ను చూసి కొంతమందిచాలా నేర్చుకోవాలి అంటున్న తెలుగు నటి !

ఆ స్టార్ హీరో ను చూసి కొంతమందిచాలా నేర్చుకోవాలి అంటున్న తెలుగు నటి !

Published on Aug 28, 2018 7:00 PM IST

ajith meena

తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం ‘విశ్వాసం’ చిత్రంలో నటిస్తున్నారు. శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో తెలుగులో చాలా చిత్రాల్లో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీనా నటిస్తుంది. సెట్ లో ఆమె, అజిత్ తో దిగిన ఫోటో ని తన ఇన్ స్టాగ్రామ్ పేజీ లో అప్లోడ్ చేసి నా సినీ జీవితంలో ఇలాంటి ఒక అద్భుతమైన హీరోని నేను ఎప్పుడు చూడలేదు.

నా కెరీర్ లో ఒక్క హిట్ వచ్చాక ఆటిట్యూడ్ ను చూపించిన ఆర్టిస్టులను చాలా చూశాను. సక్సెస్ ఎప్పుడు మన వెంటే ఉండదు. అలాంటి వారు అజిత్ సర్ కాళ్ళు కడిగి ఆయన పాదాన్ని టచ్ చేస్తే ఆయనలో 10 శాతమైన మంచి లక్షణాలు మీకు వస్తాయని హ్యాట్సాఫ్ తల అనే కాప్షన్ ను జోడించింది. ఇక మీనా గతంలో తనను అవమానపరిచిన వారిని ఉద్దేశించి ఈ ఎమోషనల్ మెసేజ్ ను షేర్ చేశారని అనిపిస్తుంది.

తాజా వార్తలు