తమిళ్‌లో పెద్ద ప్రాజెక్టులతో తెలుగు హీరోయిన్ హవా!

తమిళ్‌లో పెద్ద ప్రాజెక్టులతో తెలుగు హీరోయిన్ హవా!

Published on Nov 5, 2015 6:05 PM IST

Sri-Divya
శ్రీ దివ్య.. మనసారా సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిఆ తర్వాత బస్‌స్టాప్, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, కేరింత లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. గత కొద్దికాలంగా వరుసగా తమిళ సినిమాలకే పరిమితమైన శ్రీ దివ్య, అక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో హీరోయిన్‌గా నటిస్తూ స్టార్ స్టేటస్ దిశగా దూసుకెళుతున్నారు. ఇప్పటికే కాక్కి సెట్టై సినిమాతో మంచి హిట్ కొట్టిన శ్రీ దివ్య, ప్రస్తుతం ‘బెంగళూర్ డేస్’ తమిళ రీమేక్‌లో ఓ ప్రధాన పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

షూటింగ్ చివరిదశకు చేరిన ఈ సినిమా, తమిళంలో తనకు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతుందని శ్రీ దివ్య ధీమాగా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా విశాల్ హీరోగా నటించనున్న ఓ కొత్త సినిమాలో శ్రీ దివ్య హీరోయిన్‌గా ఎంపికవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు. విశాల్ నటించే మరుదు సినిమాలో హీరోయిన్‌గా శ్రీ దివ్య కనిపించనున్నారు. ఇక కార్తీ హీరోగా రూపొందుతోన్న ఓ భారీ సినిమా కాష్మోరాలోనూ శ్రీ దివ్య ఓ హీరోయిన్‌గా కనిపిస్తున్నారు. ఇక వరుసగా బెంగళూర్ డేస్ రీమేక్, కార్తీ కాష్మోరా, విశాల్ మరుదు.. ఇలా పెద్ద పెద్ద సినిమాలను సొంతం చేసుకుంటూ శ్రీ దివ్య తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు