డిజప్పాయింట్ అయిన తెలుగు “ఫ్యామిలీ మ్యాన్” ఫ్యాన్స్.!

Published on Jun 4, 2021 7:02 am IST

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ లలో ఒకటైన ది ఫ్యామిలీ మ్యాన్ సీసన్ 2 ఎట్టకేలకు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులోకి వచ్చేసింది. అయితే ముందు చెప్పినట్టుగానే 12 గంటల కన్నా ముందే స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే అలా వచ్చిందో లేదో మంచి ఎగ్జైట్మెంట్ లో ఓపెన్ చేసిన తెలుగు ఆడియెన్స్ కి నిరాశ ఎదురైంది.. మొదటి నుంచీ ఈ సిరీస్ రిలీజ్ తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషల్లో విడుదల అవుతుందని తెలిపారు..

కానీ ఒక్క హిందీలో మాత్రమే అందుబాటులోకి రావడంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు ఆడియెన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యిపోయారు. దీనితో తెలుగు డబ్ కోసం మనవాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఆ వెర్షన్ వచ్చే వారం విడుదల చేయనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది..మరి ఈ సాలిడ్ వెబ్ సిరీస్ లో సమంతా స్ట్రాంగ్ విలన్ రోల్ లో నటించగా మనోజ్ భాజ్ పై మెయిన్ లీడ్ లో నటించాడు. అలాగే ఈ థ్రిల్లర్ సిరీస్ ను రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :