‘బిగ్ బాస్3’ పై స్టార్ మా క్లారిటీ ఇచ్చేసింది…. !

Published on Jun 16, 2019 10:13 am IST

గతంలో వచ్చిన బిగ్ బాస్ రెండు సీజన్లు సూపర్ సక్సెస్ కావడంతో ప్రేక్షకులకు మూడవ సీజన్ పై ఆసక్తి పెరిగిపోయింది. అయితే మూడో సీజన్‌ ఎప్పుడు మొదలవుతుందనేది మాత్రం పక్కాగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. జూలై మూడోవారం లేదా చివరివారంలో అంటూ ఏవేవో ఊహాగానాలు బయటకివచ్చినా ఖచ్చితమైన నిర్ధారణ అనేది బయటకు రాలేదు. ఐతే బిగ్ బాస్ అభిమానుల అయోమయాలకు,సందేహాలకు తెరదించుతూ స్టార్ మా బృందం బిగ్‌బాస్‌ 3 కి సంబందించిన ఓ గుడ్‌న్యూస్‌ మోసుకొచ్చింది. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ త్వరలోనే రాబోతోంది అని ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ ప్రోమోను విడుదల చేశారు. ఈసారి బిగ్‌బాస్‌ మరింత కొత్తగా ఉండబోతోందని ప్రోమోను చూస్తుంటూనే తెలుస్తోంది.

ఇక బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ ఉంటుందా,లేదా అనే అనుమానాలు ఈ ప్రకటనతో తొలగిపోయాయి. ఇప్పటికే ఈ షోలో కొంతమంది పాల్గొనబోతున్నారని, దానికి సంబంధించిన ఓ లిస్ట్‌ కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. టిక్‌టాక్‌ స్టార్లు, యూట్యూబ్‌ స్టార్లు, సింగర్లు, యాంకర్లు ఇలా ప్రతి ఒక్క క్యాటగిరీ నుంచి టాప్‌ సెలబ్రెటీలు పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం :

X
More