ఎస్పీ బాలు మృతికి తెలుగు సినీ మ్యూజిషియన్స్ ప్రగాఢ సంతాపం!!!

ఎస్పీ బాలు మృతికి తెలుగు సినీ మ్యూజిషియన్స్ ప్రగాఢ సంతాపం!!!

Published on Sep 25, 2020 5:01 PM IST

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పై యావత్ భారతావని శోక సంద్రంలో మునిగింది. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. బాలుకి నివాళి గా రేపు అనగా, శనివారం 26 న రికార్డింగ్ ధియేటర్స్ మూసివేత కు పిలుపు ఇచ్చారు. 16 బాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడిన కారణ జన్ముడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి ప్రగాఢ సంతాపం అని ప్రకటించారు గాయని, తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి.

అయితే రేపు రికార్డింగ్ ధియేటర్స్ అన్ని కూడా స్వచ్చందంగా మూసివేయాలని గాయనీ గాయకులు అంతా పాటల రికార్డింగ్స్ కు దూరంగా ఉండాలి అని తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఆర్.పి. పట్నాయక్, కార్యదర్శి లీనస్, మరియు కోశాధికారి రమణ శీలం పిలుపు ఇచ్చారు. కరోనా వైరస్ నిబంధనలకు లోబడి గాన గందర్వునికి ఘన నివాళి అర్పించేందుకు త్వరలో ఒక తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు