కోలీవుడ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న తెలుగు సినిమా !


‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రం తెలుగు సినిమా యొక్క స్టామినా ఏమిటో దేశంలోని అన్ని భాషలు పరిశ్రమలకు పరిచయం చేసింది. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా ఆయన స్థానిక సినిమాల పాత రికార్డుల్ని బద్దలు కొట్టి అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా హిందీలో అప్పటి వరకు ఉన్న అమీర్ ఖాన్ ‘దంగల్’ పేరిట ఉన్న రికార్డుల్ని దాటేసిన ఈ చిత్రం తమిళనాడులో సైతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

మొదటి రెండు రోజులు కలిపి రూ. 20 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మూడవరోజు ఆదివారం మొదటి రోజున్న హవానే కొనసాగించి ఇంకో రూ. 10 కోట్లు వసూలు చేసింది. దీంతో మూడు రోజుల గ్రాస్ రూ. 30 కోట్లుగా లెక్క తేలింది. ఇది ఇప్పటి వరకు తమిళనాట ఏ తెలుగు సినిమా సాధించని అరుదైన విజయంగా చెప్పుకోవచ్చు. మొదటి రోజు ఉదయం షోలు రద్దయ్యాయి కానీ అవి కూడా అనుకున్న ప్రకారం నడిచివుంటే ఈ మొత్తం ఇంకా ఎక్కువగా ఉండి సింగిల్ డే వసూళ్లలో రజనీ ‘కబాలి’ ని అందుకునేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.