బిగ్ న్యూస్ : ‘పెద్ది’కి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ఉండదంటున్న ఎగ్జిబిటర్లు..!

బిగ్ న్యూస్ : ‘పెద్ది’కి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ఉండదంటున్న ఎగ్జిబిటర్లు..!

Published on May 23, 2026 4:29 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానాల కాంబోలో వస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పెద్ది’ టికెట్ రేట్ల పెంపుపై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. నైజాం ఏరియాలో ఈ సినిమాకు ఎలాంటి రేట్ల పెంపు ఉండబోవడం లేదని తాజాగా తెలుగు ఎగ్జిబిటర్ల సంఘం వెల్లడించింది. తాజాగా జరిగిన సమావేశంలో వారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

గతంలో పెద్ద సినిమాలకు భారీగా రేట్లు పెంచడం వల్ల సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారనే ఉద్దేశంతో “అధిక ధరలతో ప్రేక్షకులను చంపకండి” అని ఎగ్జిబిటర్లు ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ కూడా రాయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో సాధారణ ధరలకే సినిమాను ప్రదర్శించాలని.. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం టికెట్ రేట్ల పెంపు ఉంటుందని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సంఘం తెలిపింది.

రెండు రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఈ భిన్నమైన పరిస్థితులు ‘పెద్ది’ బాక్సాఫీస్ వసూళ్లపై గట్టి ప్రభావం చూపించనున్నాయి. నైజాంలో తక్కువ ధరల వల్ల ఎక్కువ మంది థియేటర్లకు వచ్చే ఛాన్స్ ఉండగా, ఏపీలో పెరిగిన రేట్లు ఓపెనింగ్స్ పరంగా సినిమాకు భారీగా ప్లస్ కానున్నాయి. మరి ఈ విభిన్న వ్యూహాలతో బుచ్చిబాబు సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

తాజా వార్తలు