మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు కొత్త డిమాండ్లు పెట్టిన నిర్మాతల మండలి

Published on Dec 1, 2020 12:35 am IST

థియేటర్లు తెరుచుకోవచ్చని ప్రభుత్వాలు నిర్మాతలకు, థియేటర్ యాజమాన్యాలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నిర్మాతలు సినిమాల విడుదలకు సన్నద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో సమావేశమైన నిర్మాతల మండలి లాక్ డౌన్ మూలాన ఎదురైన భారీ నష్టాల నుండి బయటపడటానికి అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ ప్రాసెస్లో వారు మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు నిర్మాతలు కొన్ని డిమాండ్లను రెడీ చేశారు.

వాటిలో ఇంతకుముందు వసూలు చేస్తున్న వర్చ్యువల్ ప్రింట్ ఛార్జీలను ఇకపై వసూలు చేయకూడదని అడుగుతున్నారు. సినిమా ట్రైలర్లను ఉచితంగానే ప్రసారం చేయాలని, మైంటనెన్స్ ఛార్జీలను నిర్మాతల నుండి వసూలు చేయకూడదని, అలాగే రెవెన్యూ షేరింగ్ మొదటి వారంలో 60, 40గా రెండవ వారంలో 50, 50 శాతంగా, మూడవ వారంలో 40, 60 శాతంగా ఉండాలని అడుగుతున్నారు. మరి ఈ కొత్త డిమాండ్లకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అంగీకరిస్తాయో లేదో చూడాలి. ఆలస్యం లేకుండా యాజమాన్యాలు గనుక నిర్మాతల షరతులకు ఒప్పుకుంటే సినిమా ప్రదర్శనలు త్వరగానే రీస్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :

More