
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈషా రెబ్బా, చాందినీ చౌదరీ, శోభిత ధూళిపాళ, నందినీ రాయ్, ప్రియాంక జవాల్కర్ లాంటి కొంతమంది తెలుగు హీరోయిన్స్ తమ సత్తా చాటుతున్నారు. వీరిలో తన అందం, అభినయంతో ఈషా రెబ్బా కాస్త ముందుంజలో ఉంది. సెలెక్టివ్ గా తనకొస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ని కొనసాగిస్తోంది. కాగా `పిట్ట కథలు` వెబ్ సిరీస్ లో డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించింది ఈషా రెబ్బా.
అయితే తాజాగా ఈ బ్యూటీ సూపర్ ఛాన్స్ అందుకున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మహాభారతంలోని ఆదిపర్వంలోగల దుష్యంతుడు, శాకుంతలం ప్రేమ కథ నేపథ్యంలో డైరెక్టర్ గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాను చేయనున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసింది. ఇందులో శకుంతల పాత్రలో ‘సమంత’ నటిస్తోంది. కాగా ఈ మూవీలో మరో కీలక పాత్ర కోసం గుణశేఖర్ ఈషా రెబ్బాని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.