వైరల్ అవుతున్న ఈషా రెబ్బ హాట్ స్టిల్స్ !

వైరల్ అవుతున్న ఈషా రెబ్బ హాట్ స్టిల్స్ !

Published on Mar 28, 2019 7:56 PM IST

ప్రస్తుతం ఈషా రెబ్బ హాట్ స్టిల్స్ రెండు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ తెలుగు బ్యూటీ తన గ్లామర్ తోనే కాకుండా ఈ రోజు తన లేటెస్ట్ సినిమా అప్ డేట్ తో కూడా వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ హర్రర్ థ్రిల్లర్ లో ఈషా నటించనుంది.

ఈ సినిమాకు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. ఇక ‘అంతకు ముందు ఆ తరువాత’ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన, ఈ అచ్చ తెలుగు అమ్మాయి ఆ తర్వాత ‘అమీతుమీ’, ‘అ’, అరవింద సమేత లాంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

మరి ఇప్పుడు తనే ప్రధాన పాత్రలో ఓ హర్రర్ థ్రిల్లర్ తో రాబోతుంది. త్వరలోనే ఈ చిత్రం షూట్ కి వెళ్లనుంది. అయితే ఈ చిత్రంలో నటించే ఇతర తారాగణం గురించి, సాంకేతిక విభాగం గురించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు