సాయి సింహాద్రి హీరోగా నటించి, నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సన్ ఆఫ్’ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై సందడి చేస్తోంది. బత్తుల సతీష్ దర్శకత్వంలో సాయి సింహాద్రి సైన్మా బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో మీరా రాజ్ హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటుడు వినోద్ కుమార్ తండ్రి పాత్రలో కనిపించారు. హనుమాన్ మీడియా సంస్థ ద్వారా ఇదివరకే ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, నేటి నుంచి ‘అమెజాన్ ప్రైమ్’లోనూ అందుబాటులోకి వచ్చింది.
ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా మొదటి భాగం అందమైన పల్లెటూరి వాతావరణం, వినోదంతో సాగుతూ ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో తండ్రీకొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, ఆకట్టుకునే క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని థియేటర్లలో ఆదరించినట్లే, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా వీక్షించి విజయవంతం చేయాలని చిత్ర బృందం ప్రేక్షకులను కోరింది.


