ఆత్మహత్య చేసుకున్న తెలుగు సంగీత దర్శకుడు !
Published on Jun 15, 2018 8:03 pm IST


సంగీత దర్శకుడు అనురాగ్ వినీల్‌ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. అనురాగ్ సంగీతం సమకూర్చిన పలు ప్రైవేట్ ఆల్బమ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా నీలాకాశం, ఓ చెలియా.. పాటలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇంకా ఆయన కంపోజ్ చేసిన పాటల్లో అనేక పాటలు బాగా ప్రజాదారణ పొందాయి. ఈయన ఎక్కువుగా ప్రైవేట్ పాటలకే సంగీతాన్ని సమకూర్చారు. నాగోల్‌లోని మమతానగర్‌లో అనురాగ్ నివాసముంటున్నారు అక్కడే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.

అయితే అనురాగ్ వినీల్‌ ఆత్మహత్యకు కారణం ఆరా తీయగా అనురాగ్ డ్రగ్స్‌కు బానిసైనట్టు, అయన చుట్టుప్రక్కల నివాసముంటున్న వారు అనుమానం వ్యక్తం చేశారు. అనురాగ్ గత కొంతకాలంగా ఆర్ధిక ఇబ్బందులతో కూడా సతమతవుతున్నారు. అప్పు ఇచ్చిన కొందరు వేధింపులకు గురి చెయ్యటంతో అనురాగ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook