‘జిగర్తాండ’ తెలుగు రీమేక్ ఫై క్లారిటీ వచ్చింది !

Published on Dec 20, 2018 11:36 am IST

‘దువ్వాడ జగన్నాథమ్’ విడుదలై ఏడాదికి పైనే అవుతున్న ఇంతవరకు తన కొత్త సినిమాను ప్రకటించలేదు డ్యాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్. మధ్యలో దిల్ రాజు బ్యానర్ లో దాగుడుమూతలు అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేసిన ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. దాంతో మళ్ళీ కొంచం గ్యాప్ తీసుకొని తమిళ సూపర్ హిట్ మూవీ ‘జిగర్తాండ’ ను తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. కాకపోతే ఈ చిత్రం ఫై ఇంతవరకు హరీష్ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇవ్వని రూమర్లే అని వార్తలు కూడా వచ్చాయి.

ఇక ఎట్టకేలకు ఈ చిత్రం ఫై ఓ క్లారిటీ వచ్చింది. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఈ చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేయనున్నారని సమాచారం. ఈచిత్రంలో వరుణ్ తేజ్ ను ప్రతినాయకుడి పాత్రకు ఎంపిక చేయగా ‘ఛలో’ బ్యూటీ రష్మిక మండన్న కథానాయికగా నటించనుంది. ఒరిజినల్ వర్షన్ లో సిద్దార్థ నటించిన పాత్రకు ప్రస్తుతం హీరోను వెతికే పనిలో వున్నారు హరీష్. 14 రీల్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

సంబంధిత సమాచారం :