ఫోర్బ్స్ ఇండియా లిస్టులో తెలుగు స్టార్స్ వీళ్ళే

ఫోర్బ్స్ ఇండియా లిస్టులో తెలుగు స్టార్స్ వీళ్ళే

Published on Dec 11, 2015 1:29 PM IST

Mahesh-rajamouli
2015 ఇయర్ ఎండ్ కి చేరుకున్నాం.. దాంతో ఫేమస్ మాగజైన్స్ ఈ ఏడాది జరిగిన అన్ని విషయాల్లో ది బెస్ట్ లిస్టు ని ప్రిపేర్ చేసే పనిలో పడ్డారు. అందులో బాగా ఫేమస్ అయిన ఫోర్బ్స్ మాగజైన్ వారు అప్పుడే ఈ ఏడాది ఇండియాలో మోస్ట్ ఫేమస్ అయిన 100 మంది సెలబ్రిటీస్ లిస్టు ని తయారు చేసింది. అందులో మన తెలుగు స్టార్స్ కూడా చాలా మంది ఉన్నారు. అందులో ఈ మధ్య ఇండియాలో తెలుగు నుంచి ఫేమస్ స్టార్ అనిపించుకున్న మహేష్ బాబు ఫోర్బ్స్ లిస్టులో 2015లో 51.5 కోట్లు సాధించిన వ్యక్తిగా 36వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

మహేష్ బాబు తర్వాత అల్లు అర్జున్ 37.5 కోట్ల సంపాదనతో 42వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సినిమాతో బాగా ఫేమస్ అవ్వడమే కాకుండా 26 కోట్ల సంపాదనతో 72వ స్థానాన్ని దక్కించుకోగా, 12.5 కోట్ల సంపాదనతో మాస్ మహారాజ్ రవితేజ 72వ స్థానాన్ని దక్కించుకుంటే, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 24 కోట్ల సంపాదనతో 77వ స్థానాన్ని, పూరి జగన్నాధ్ 15.67కోట్ల సంపాదనతో 89వ ప్లేస్ ని సంపాదించుకున్నారు. ఈ ఫోర్బ్స్ జాబితా లిస్టు ని స్టార్స్ లేదా సెలబ్రిటీస్ యొక్క సంపాదన మరియు ఫేంని బట్టి తయారు చేసారు. తెలుగు స్టార్స్ కాకుండా బాలీవుడ్ నుంచి చాలా మంది స్టార్స్ లిస్టులో ఉన్నారు.

తాజా వార్తలు