రానా సినిమాకి తెలుగు టైటిల్ ఖరారు !

రానా సినిమాకి తెలుగు టైటిల్ ఖరారు !

Published on Jun 4, 2018 3:32 PM IST

నటుడు రానా చేస్తున్న సినిమాల్లో ప్రత్యేకంగా కనిపిస్తున్న చిత్రం ‘హాతి మేరే సాతి’. ఏనుగుల నైపథ్యంలో ఉండనున్న సాగే రియలిస్టిక్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ప్రభు సాలమన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం రానా ప్రత్యేకమైన శిక్షణ కూడ తీసుకున్నారు. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ కు ‘అరణ్య’ అనే తెలుగు టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా రూపొందించనున్నారు. తమిళంలో ఈ చిత్రానికి ‘కాదన్’ అనే టైటిల్ ను నిర్ణయించారు. ఏనుగులు, మనుషులు మధ్య ఉండే స్నేహ బంధం అనే అంశం మీద ఈ సినిమా ఉండనుంది. ఈ ఏడాది దీపావళి కానుక విడుదలకానున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, పుల్కిత్ సామ్రాట్ వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది కాకుండా రానా భారతీయ ప్రసిద్ధ మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ లో కూడ నటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు