“ధృవ నక్షత్రం” తెలుగు ట్రైలర్ రిలీజ్ కి రెడీ!

dhurva

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ యొక్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నచ్చతిరమ్ నవంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. మొదటి భాగానికి ధృవ నచ్చతిరం: చాప్టర్ 1 – యుద్ధ ఖాండం అని పేరు పెట్టారు. తెలుగు వెర్షన్‌కు ధృవ నక్షత్రం అని పేరు పెట్టారు. ఇది ఒరిజినల్ వెర్షన్‌తో పాటు ఒకేసారి విడుదల అవుతుంది.

ఇప్పటికే తమిళ ట్రైలర్‌ను విడుదల చేయగా, నవంబర్ 9న తెలుగు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకుడు మరియు నిర్మాత. ఈ చిత్రంలో రీతూ వర్మ, పార్తిబన్, ఐశ్వర్య రాజేష్, రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, అర్జున్ దాస్ మరియు దివ్యదర్శిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిస్ జయరాజ్ స్వరాలు సమకూర్చారు.

Exit mobile version