సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 5వ ఎడిషన్లో తెలుగు వారియర్స్ జట్టు వరుస విజయాలతో జైత్ర యాత్ర కొనసాగిస్తుంది. రాంచీ, జార్ఖండ్ లో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో భోజ్ పూరి దబాంగ్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. రెగ్యులర్ కెప్టెన్ విక్టరీ వెంకటేష్ హాజరుకాకపోవడంతో అక్కినేని అఖిల్ తెలుగు వారియర్స్ జట్టుకు కెప్టెన్సీ వహించారు. తెలుగు స్టార్స్ అన్ని విభాగాలలో సంపూర్ణ ఆధిపత్యం కనబరచడంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది.
మొదట బ్యాటింగ్ చేసిన భోజ్ పూరి దబాంగ్స్ జట్టు 20 ఓవర్లలో 155 పరుగులు చేసింది. లక్ష చేదనలో అద్బుతంగా బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ ఓపెనర్లు ప్రిన్స్ మరియు సచిన్ జోషిలు జట్టును విజయ తీరాలకు చేర్చారు. కష్టతరమైన లక్ష్యాన్ని సుసాధ్యం చేశారు. ప్రిన్స్
48 బంతులలో 61 పరుగులు చేశాడు. విజయంలో కీలక పాత్ర పోషించిన సచిన్ జోషి మాన్ అఫ్ ది మ్యాచ్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. అతను 42 బంతుల్లో 77 పరుగుల చేశాడు. తెలుగు వారియర్స్ టీం, తన తదుపరి మ్యాచ్లో కర్ణాటక బుల్డోజర్ టీంతో తలపడుతుంది.


