హాలీవుడ్‌ చిత్రం మెయిన్ లీడ్ లో యువ తెలుగు నటుడు.!

Published on Jun 11, 2021 7:00 pm IST

హాలీవుడ్ సినిమాలు మన దగ్గర కూడా ఎలా చూస్తారో మనకి తెలుసు. అలాంటిది మన భారతీయ నటుడు ఫలానా హాలీవుడ్ సినిమాలో ఉన్నాడంటే మరింత ఆసక్తి నెలకొంటుంది. మరి ఇప్పుడు ఓ హాలీవుడ్ చిత్రంలో మన తెలుగు యువ నటుడు అందులోని మెయిన్ రోల్ లో నటిస్తున్నాడని తెలిసింది. ఇక వివరాల్లోకి వెళ్తే నటుడు రాజ్ దాసిరెడ్డి తెలుగు సినిమాలో పనిచేశారు. ఇప్పుడు చాలా ప్రశంసలు పొందిన హాలీవుడ్ దర్శకుడు మరియు నిర్మాత మైఖేల్ బే తో కలిసి పని చేయబోతున్నారని తెలిసింది.

ప్రస్తుతం అయితే మైఖేల్ బే, తన ప్రొడక్షన్ హౌస్ లో అంబులెన్స్, ది ఫరెవర్ ఫార్జ్ అలాగే భారీ హిట్ ఏ క్వైట్ ప్లేస్ కి సీక్వెల్ చిత్రాలు ఉన్నాయి. మరి అలాంటి సంస్థతో ఈ నటుడు చేయడం విశేషం.అది కూడా ప్రపంచంలో మొట్టమొదటి మోటారు కారును పరిచయం చేసిన ఇంజనీర్ మరియు “మెర్సిడెస్” కార్ బ్రాండ్ యొక్క పరిణామం చుట్టూ కథ తిరుగుతుంది. చలన చిత్రం యొక్క అధికారిక స్పాన్సర్డ్ భాగస్వామి డైమ్లెర్ ఏజి అని పేర్కొన్నారు.

ఈ చిత్రంలో రాజ్ దాసిరెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తుండగా “మెర్సిడెస్” చిత్రం ప్రపంచవ్యాప్తంగా 27 భాషలలో విడుదల కానుంది. మూలం ప్రకారం 30 నుండి 50 శాతం సినిమా షూటింగ్ పూర్తయింది. మెర్సిడెస్ మూవీ 2022 లో విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాండమిక్ కారణంగా, విడుదల తేదీ ఎప్పుడు అన్నది ఇంకా కన్ఫర్మ్ చెయ్యలేదు.

సంబంధిత సమాచారం :