జనవరి 28న ‘టెంపర్’ ఆడియో విడుదల..!

జనవరి 28న ‘టెంపర్’ ఆడియో విడుదల..!

Published on Jan 22, 2015 11:19 AM IST

temper
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టెంపర్’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం ‘టెంపర్’ ఆడియోను జనవరి 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

2014లో వరుస మ్యూజికల్ హిట్స్ తో ప్రేక్షకులను అలరించిన యువ సంగీత సంచలనం అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. ఆల్రెడీ. టీజర్ లో అనూప్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 13న సినిమాను విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు