జనవరి 18న ఎన్టీఆర్ ‘టెంపర్’ ఆడియో

జనవరి 18న ఎన్టీఆర్ ‘టెంపర్’ ఆడియో

Published on Jan 7, 2015 6:49 PM IST

Temper-ntr
యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన తాజా సినిమా ‘టెంపర్’ ఆడియోను జనవరి 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి శిల్పకళా వేదిక ముస్తాబవుతుంది. అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం భారి ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యువ సంగీత సంచలనం అనూప్ రూబెన్స్ స్వరాలను సమకూర్చారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు