3 రోజుల కలెక్షన్ రిపోర్ట్ : అదరగొడుతున్న టెంపర్

3 రోజుల కలెక్షన్ రిపోర్ట్ : అదరగొడుతున్న టెంపర్

Published on Feb 16, 2015 2:59 PM IST

Temper-movie-review

నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఫుల్ లెంగ్త్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమా ‘టెంపర్’. నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న హిట్ ని ఎన్.టి.ఆర్ టెంపర్ రూపంలో అందించాడు. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీ బెనిఫిట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆంధ్ర, తెలంగాణలోనే కాకుండా తమిళనాడు, చెన్నైలలో కూడా ఫస్ట్ వీకెండ్ సూపర్బ్ కలెక్షన్స్ ని రాబట్టుకుంది. టెంపర్ సినిమా నైజాం లోమొదటి మూడు రోజుల్లో 5 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిందని, అలాగే యుఎస్ లో $871K కలెక్ట్ చేసి 1 మిలియన్ మార్క్ కి దగ్గరగా ఉందని ఇదివరకే తెలియజేశాం.

నైజాం, యుఎస్ లోనే కాకుండా మిగతా ఏరియాలైన గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా సూపర్బ్ కలెక్షన్స్ వస్తున్నాయి. మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూడు ఏరియాల కలెక్షన్ రిపోర్ట్ ని మీకందిస్తున్నాం.

ఏరియా 3వ రోజు కలెక్షన్స్ 3 రోజుల మొత్తం షేర్
గుంటూరు 36.50 లక్షలు 1.95 కోట్లు
కృష్ణా 35.60 లక్షలు .28 కోట్లు
పశ్చిమ గోదావరి 22 లక్షలు 1.11 కోట్లు
మొత్తం 94.1 లక్షల 4.34 కోట్లు

యంగ్ టైగర్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ కి పూరి జగన్నాధ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, పంచ్ డైలాగ్స్ తోడవడంతో థియేటర్స్ లో ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. బ్లాక్ బస్టర్ కోసం ఎంతగానో కష్టపడే బండ్ల గణేష్ ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు