35కోట్ల మార్కుకి చేరువవుతున్న టెంపర్

35కోట్ల మార్కుకి చేరువవుతున్న టెంపర్

Published on Feb 20, 2015 6:30 PM IST

Temper
ఎన్.టి.ఆర్ నటించిన టెంపర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనవిజయం సాధించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటివారం ముగిసేసరికి 35కోట్లు సంపాదించింది.

సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో, మాస్ ఏరియాలలో ఈ సినిమా కలెక్షన్లకు ఎదురులేకుండాపోతుంది. ముఖ్యంగా నిజాం ఏరియాలో దుమ్మురేపుతుందని ట్రేడ్ వర్గాల టాక్. పూరి జగన్ చిత్రీకరించిన ఈ సినిమా అమెరికాలో సైతం అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టుకుంటుంది.

కాజల్ అగర్వాల్ హీరోయిన్. అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు. బండ్ల గణేష్ నిర్మాత. టెంపర్ సినిమాలో తారక్ ని సరికొత్త రూపంలో చూసామని అభిమానులు ఆనందపడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు