10 కోట్ల మార్క్ కి దగ్గరలో ‘టెంపర్’ నైజాం కలెక్షన్స్

10 కోట్ల మార్క్ కి దగ్గరలో ‘టెంపర్’ నైజాం కలెక్షన్స్

Published on Feb 19, 2015 5:27 PM IST

temper
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ట్రైలర్ లో చెప్పినట్టుగానే ‘టెంపర్’ సినిమాతో బాక్స్ ఆఫీసు వద్ద దండయాత్ర చేస్తున్నాడు. అభిమానులంతా కాలర్ ఎగరేసుకొని తిగిగే హిట్ ఇవ్వడమే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద సూపర్బ్ కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నాడు. ఎన్.టి.ఆర్ లుక్స్ పరంగా ఎన్నడూ లేనంత స్టైలిష్ గా కనిపించడమే కాకుండా యాక్టింగ్ మరియు డైలాగ్ డెలివరీలో కూడా కొత్తదనం చూపించి అభిమానుల్లో తెమపార్ ని లేపాడు. ఈ సినిమా అన్ని ఎరియాల్లోనూ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది.

ముఖ్యంగా నైజాంలో మొదటి రోజు నుంచే అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి మూడు రోజుల్లోనే నైజాంలో 5 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన ఈ సినిమా మొదటి వారంలో ఈజీగా 10 కోట్ల మార్క్ ని క్రాస్ చేసేలా ఉంది. ఈ వారంలో శివరాత్రికి సెలవు రావడం ఈ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. మాకు అందిన సమాచారం ప్రకారం నైజాంలో మొదటి 6 రోజుల్లో 9.4 కోట్ల షేర్ సాధించింది. మొదటి వారంలో అనగా నేటితో ఈ సినిమా 10 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ ఎమోషనల్ పోలీస్ డ్రామాని బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించాడు.

తాజా వార్తలు