బంపర్ ప్రైజ్ పలికిన ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ ఓవర్సీస్ రైట్స్

బంపర్ ప్రైజ్ పలికిన ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ ఓవర్సీస్ రైట్స్

Published on Jan 13, 2015 3:48 PM IST

Temper

బ్లాక్ బస్టర్ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ నిర్మాతగా ‘బాద్షా’ ఎన్.టి.ఆర్ తో చేస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘టెంపర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ దయ పాత్రాలి కనిపిచానున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ మరియు ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ కి అడిరిపోత్యే రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా రైట్స్ కోసం పోటీపడే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కోసం హెవీగా జరిగిన కాంపిటీషన్ లో ఓ బంపర్ ప్రైజ్ కి గ్రేటర్ ఇండియా వారు రైట్స్ ని సొంతం చేసుకున్నారు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ వారు గతంలో ఎన్.టి.ఆర్ నటించిన ‘స్టూడెంట్ నెం 1’, ‘అదుర్స్’, ‘బృందావనం’, ‘బాద్షా’ లాంటి సూపర్ హిట్ సినిమాలను ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేసారు. అలాగే పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ‘పోకిరి’, ‘చిరుత’ లాంటి సూపర్ హిట్ మూవీలను కూడా వీరే డిస్ట్రిబ్యూట్ చేసారు. ఈ సినిమాని కూడా భారీ ఎత్తున ఓవర్సీస్ లో రిలీజ్ చెయ్యడానికి గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ వారు ప్లాన్ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు