చార్మినార్ దగ్గర షాపింగ్ చేసిన టెంపర్ రీమేక్ హీరోయిన్ !
Published on Jun 13, 2018 1:17 am IST

హైదరాబాద్లో చార్మినార్ ఎంత ఫేమస్సో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు .దీనికి సమీపంలో లాడ్ బజార్ అనే వీధి వుంది ఈ బజార్ గాజులకు చాలా ఫేమస్ . తాజాగా ఇక్కడికి ఓ హిందీ హీరోయిన్ వచ్చి షాపింగ్ చేసింది. పాత తరం హీరోయిన్ అమ్రితా సింగ్ తన కూతురు సారా అలీ ఖాన్ తో కలిసి ఇక్కడ షాపింగ్ చేశారు. సారా అలీ ఖాన్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు .

సారా టెంపర్ రీమేక్ గా తెరకెక్కుతున్న ‘సింబా’ సినిమాలో కథానాయికగా నటిస్తుంది ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది . రణవీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అదింస్తున్నాడు. కరణ్ జోహార్, రోహిత్ శెట్టిలు కలిసి ఈసినిమాని నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook