జూనియర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న ‘టెంపర్’ సినిమా ముందుగా ప్లాన్ చేసినట్టుగానే తదుపరి మరియు ఫైనల్ షెడ్యూల్ రేపటినుండి ప్రారంభంకానుంది. ఈరోజు ఉదయం తారక్ కి జానకిరామ్ బాధనుండి బయటకు రావడానికి కొంత విరామం కావాలని, కాబట్టి షూటింగ్ వాయిదాపడనుందని వార్తలు వినిపించినా తాజా సమాచారం ప్రకారం షెడ్యూల్ యధావిధిగా వుంటుందని, ఒక వారంలోపు ట్రైలర్ కూడా విడుదల చేస్తారని తెలిసింది
వక్కంతం వంశీ కధను అందించాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. బండ్ల గణేష్ నిర్మాత. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదలచెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. తారక్ ఈ చిత్రంలో పూర్తిస్థాయి పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించనున్నాడు


