
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన సినిమా ‘టెంపర్’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. అప్పుడే ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ఇతర భాషా సినిమాల నిర్మాతలు పోటి పడుతున్నారు.
అయితే, ‘టెంపర్’ సినిమాను హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషలలో నిర్మించాలనే ఆలోచన ఉందని నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. హిందీలో సైతం పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తారని చెప్పారు. మానభంగం, అత్యాచారాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషలలో ఘన విజయం సాదించే సత్తా ఉందని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.

