మెగాస్టార్ ‘ఆచార్య’ కోసం దేవాలయం సెట్ !

chiru1

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. మెగా సినిమా కావ‌డంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పురాతన దేవాలయం సెట్ వేస్తున్నారట. కరోనా ప్రభావం తగ్గాక ఈ సెట్ లో నే మెగాస్టార్ షూట్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ఏమైనా కరోనా వల్ల భారీ సినిమాల షూటింగ్స్ జరిగే పరిస్థితి లేకుండా పోయింది.

కాగా రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేశారు. యంగ్ గా కనిపించడానికి చాలా మేక్ ఓవర్ కూడా అయ్యారు.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. చరణ్ పాత్ర ఎమోషనల్ పాత్రగా ఉంటుందని, పైగా ప్రేరణగా నిలుస్తోందట. ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Exit mobile version