సెప్టెంబర్ లో ‘తెనాలి రామకృష్ణ’ !

Published on Jun 28, 2019 12:00 am IST

గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సందీప్ కిషన్ హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’. ఈ చిత్రం షూటింగ్ జులై రెండో వారం కల్లా పూర్తి చేసుకొని.. ఆగష్టులో సినిమాని విడుదల చేయాలనుకున్నారు. అయితే సందీప్ కిషన్ ఇటీవలే షూటింగ్ లో గాయపడటంతో షెడ్యూల్ మొత్తం పోస్ట్ ఫోన్ చేశారు. దాంతో సినిమా విడుదల కూడా పోస్ట్ ఫోన్ కానుందట.

ఆగష్టు లోపు సినిమను పూర్తి చేసి.. సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ లాంటి ఫుల్ ఎంటర్ టైనర్ తో మంచి హిట్ అందుకున్న సందీప్ కిషన్, మళ్లీ ఆ తరువాత ఆ స్థాయిలో కామెడీ సినిమాను చెయ్యలేదు. అందుకే ఈ సారి ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాని చేసి.. సూపర్ హిట్ అందుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ ‘తెనాలి రామకృష్ణ’ సినిమాని చేస్తోన్నాడు. మరి ఈ సినిమా అన్నా సందీప్ కి హిట్ ఇస్తోందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More