తెరి రీమేక్ మళ్లీ ఆగిపోయిందా ?

Published on Apr 11, 2019 8:23 am IST

తమిళ స్టార్ హీరో విజయ్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం తెరి 2016లో విడుదలై అక్కడ బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించింది. దాంతో ఈ చిత్రం యొక్క రీమేక్ రైట్స్ ను మూడు సంవత్సరాల క్రితం టాప్ ప్రొడక్షన్ హాజ్ మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది.

ఇక ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేద్దాం అనుకున్నారు కానీ ఆయన పాలిటిక్స్ లో బిజీ గా కావడంతో ఈ ఆఫర్ రవితేజ దగ్గరికి వెళ్ళింది. సంతోష్ శ్రీనివాస్ ను దర్శకుడు గా అనుకున్నారు. రవితేజ కూడా ఓకే చెప్పాడు. సినిమా కూడా లాంచ్ అయ్యింది. అయితే ఆతరువాత సినిమా ఎందుకో పట్టాలెక్కలేదు.

రవితేజ కూడా శ్రీను వైట్ల తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడంతో ఈ రీమేక్ ను హోల్డ్ లో పెట్టారు. ఇక ఇటీవల మళ్ళీ ఈసినిమా వార్తల్లోకెక్కింది. సినిమా స్క్రిప్ట్ అంత మార్చారని ఈనెల 15నుండి సెట్స్ మీదకు వెళుతుందని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు కారణాలు తెలియవు గాని ఈ సినిమా వర్క్ అవుట్ కాదని మైత్రి ఈ ప్రాజెక్ట్ ను మొత్తానికే పక్కకు పెట్టేసిందని టాక్ వినిపిస్తుంది. మరి అతి త్వరలో ఈ సినిమా గురించి పూర్తి క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం :